High Court: హైదరాబాద్‌ను మరో పంజాబ్ చేయాలనుకుంటున్నారా?.. వెంటనే అవి మూసేయండి

by Gantepaka Srikanth |

మసాజ్ సెంటర్లను, హుక్కా సెంటర్లను మూసి వేసే దిశగా చర్యలు తీసుకోవాలని జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి సంచలన వ్యాఖ్యాలు చేశారు.

High Court: హైదరాబాద్‌ను మరో పంజాబ్ చేయాలనుకుంటున్నారా?.. వెంటనే అవి మూసేయండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: మసాజ్ సెంటర్లను, హుక్కా సెంటర్లను మూసి వేసే దిశగా చర్యలు తీసుకోవాలని జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి సంచలన వ్యాఖ్యాలు చేశారు. బొమ్మెర రాహుల్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ విచారణలో భాగంగా జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను మరో పంజాబ్‌లా చేయాలని చూస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్ రాష్ర్టంలో డ్రగ్స్ విచ్చలవిడిగా వినియోగిస్తున్నరని ప్రతి ఐదుగురిలో ఇద్దరూ డ్రగ్స్‌కు బానిసగా మారారని తెలిపారు.

హుక్కాలో 200 సిగరెట్లకు సమానమైన విష వాయువులు ఉంటాయని తెలిపారు. మీ కుటుంబంలోని వ్యక్తి ఎవరైనా డ్సగ్స్‌కు బానిసైతే ఎలా ఉంటుందో అప్పడు బాధ మీకు అర్థం అవుతుందని అన్నారు. హుక్కా సెంటర్ల నిర్వహణపై అనుమతిలిచ్చిన విధానం సరిగా లేదన్నారు. హుక్కా వినియోగం అనేది సమాజంపై చెడు ప్రభావం చూపడం లేదా అని ప్రశ్నించారు. అలాగే మసాజ్ సెంటర్ల ద్వారా సమాజం పెడదారిపడుతుందని అన్నారు. ఆడ, మగ ఏదైనా మాసాజ్ సెంటర్లను నిషేధించాలని తెలిపారు.

Next Story