ఢిల్లీలో రూ.6 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత.. ఐదుగురు అరెస్ట్

by Malleboina Mahesh |

దేశ రాజధాని నగరం అయిన ఢిల్లీలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది.

ఢిల్లీలో రూ.6 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత.. ఐదుగురు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని నగరం అయిన ఢిల్లీలో మరోసారి డ్రగ్స్ (Drugs) కలకలం రేపింది. మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌లపై నిరంతర ఆపరేషన్‌ (Continuous operation)లో భాగంగా పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో.. 3.1 కిలోగ్రాముల హెరాయిన్ పట్టుబడింది. ఉత్తర ఢిల్లీలో జరిగిన ఈ భారీ దాడుల్లో ఐదుగురు మాదకద్రవ్యాల వ్యాపారులను ఢిల్లీ పోలీసులు (Delhi Police) అరెస్టు చేశారు. ఈ దాడిలో పట్టుబడ్డ హెరాయిన్ (Heroin) సుమారు రూ.6 కోట్ల విలువ చేస్తుందని ఒక అధికారి మీడియాకు తెలిపారు. మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌లపై నిరంతర ఆపరేషన్‌లో భాగంగా హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, డ్రగ్స్ నెట్ వర్క్ (Drugs Network)కు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలిపారు.

Next Story