CID కార్యాలయంలో హీరో విజయ్ దేవరకొండ

by Gantepaka Srikanth |

బెట్టింగ్‌ యాప్స్‌ కేసు(Betting Apps Case)లో తెలంగాణ సీఐడీ దూకుడు ప్రదర్శిస్తోంది.

CID కార్యాలయంలో హీరో విజయ్ దేవరకొండ
X

దిశ, వెబ్‌డెస్క్: బెట్టింగ్‌ యాప్స్‌ కేసు(Betting Apps Case)లో తెలంగాణ సీఐడీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఇప్పటికే సినీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), నటుడు ప్రకాశ్ రాజ్‌(Prakash Raj)లకు సీఐడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం వీరిద్దరూ విచారణకు హాజరయ్యారు. వీరి స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేశారు. కాగా, ఇటీవలే బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో తెలంగాణ సీఐడీ కీలక ఆపరేషన్‌ చేపట్టింది. గుజరాత్‌, రాజస్థాన్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లోని ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి 8 మందిని అరెస్టు చేసింది. వీరంతా 6 బెట్టింగ్‌ యాప్‌లను నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తాజ్‌ 007, ఫెయిర్‌ప్లే లైవ్‌, ఆంధ్ర 365, వీఎల్‌ బుక్‌, తెలుగు 365, యస్‌ 365 బెట్టింగ్‌ యాప్‌లను ఈ ముఠా నిర్వహిస్తోంది.

Next Story