- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లైన తెల్లారే ఇళ్లు గుల్ల.. అసలు ఏం జరిగిందంటే?
పెళ్లింట్లో దొంగలు పడి 11 లక్షల రూపాయల సొత్తును దోచుకొని ఉడాయించారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: పెళ్లింట్లో దొంగలు పడి 11 లక్షల రూపాయల సొత్తును దోచుకొని ఉడాయించారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. సాకేత్ పురం ఫస్ట్ ఫేజ్‌లో నివాసం ఉండే శాస్త్రి అనే వ్యక్తి కూతురి వివాహం ఇటీవల జరిగింది. శనివారం రాత్రి రిసెప్షన్ ఉండటంతో శాస్త్రి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. అర్ధరాత్రి సమయంలో ఇంటికి రాగా వెనక వైపు తలుపులు పగులగొట్టి ఉండటం కనిపించింది. ఇంట్లోకి వెళ్లి చూడగా.. దొంగలు పడ్డట్లు ఆనవాళ్లు కనిపించాయి. ఇంట్లోని 3 లక్షల 72 వేల విలువ చేసే బంగారు నగలు, 3 లక్షల విలువ చేసే ల్యాప్ టాపులు, 5 కిలోల వెండి వస్తువులు, పది వేల నగదును చోరీ చేసినట్టు తెలిసింది. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న బుల్లెట్ బండిని అపహరించటానికి ప్రయత్నించినట్టు కనిపించింది. ఈ మేరకు శాస్త్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..






