నగరంలో భారీ వర్షం.. వరద నీటిలో కొట్టుకుపోయిన యువకుడి మృతి

by Kema Shiva Kumar |

హైదరాబాద్ మహానగరం బుధవారం రాత్రి కురిసిన వర్షానికి అతలాకుతలమైంది.

నగరంలో భారీ వర్షం.. వరద నీటిలో కొట్టుకుపోయిన యువకుడి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరం బుధవారం రాత్రి కురిసిన వర్షానికి అతలాకుతలమైంది. పలు ప్రాంతాల్లో కుండపోత వానతో నిమిషాల వ్యవధిలోనే ప్రధాన రహదారులు అన్ని చెరువులను తలపించాయి. దీంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌తో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇక టోలిచౌకి దగ్గర ప్రధాన రహదారి వరద నీటికి కనిపించకుండా పోయింది. ఐకియా నుంచి మాదాపూర్, కేపీహెచ్‌బీ వరకు ట్రాఫిక్‌ జామ్ అయింది. మెట్రో స్టేషన్ల కింద వర్షపు నీరు భారీగా నిలించింది. దీంతో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచించారు. ఇక రాత్రి కురిసిన వర్షానికి ముషీరాబాద్‌‌కు చెందిన షరీఫుద్దీన్ (27) అనే మృతి చెందాడు. పని ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా బల్కంపేట్‌ అండర్‌పాస్‌ వద్ద షరీఫుద్దీన్ వరద నీటిలో కొట్టుకుపోయాడు. అతడిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. అనంతరం రెస్క్యూ టీమ్ స్పాట్‌కు చేరుకుని షరీఫుద్దీన్‌ మృతదేహాన్ని బయటకు తీసి కుటుంబ సభ్యలకు అప్పగించారు.

Next Story