ఘోర రోడ్డు ప్రమాదం.. హెడ్‌కానిస్టేబుల్ స్పాట్ డెడ్

by Gantepaka Srikanth |

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

ఘోర రోడ్డు ప్రమాదం.. హెడ్‌కానిస్టేబుల్ స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హెడ్‌కానిస్టేబుల్(Head Constable) సైదులు గౌడ్(Saidulu Goud) అక్కడిక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. జి.చెన్నారంలో పిటిషన్ ఇచ్చి కనగల్ వైపునకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం సైదులు గౌడ్ కనగల్ పోలీస్ స్టేషన్‌(Kanagal Police Station)లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story