- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమర ప్రేమికులు.. బయటపడ్డ లవర్స్ హాష్ అయిల్ దందా..!
బాయ్ ఫ్రెండ్ తీసుకువచ్చి ఇస్తే ప్రియురాలు హాష్ అయిల్ ను అమ్మేస్తుంది. ఏపీ శ్రీకాకుళంలో బాయ్ ఫ్రెండ్ హైదరాబాద్ చింతల్ లో లవర్ నివాసం ఉంటు హష్ అయిల్ మత్తు దందాను నడిపిస్తున్నారు.

దిశ, సిటీక్రైం : బాయ్ ఫ్రెండ్ తీసుకువచ్చి ఇస్తే ప్రియురాలు హాష్ అయిల్ ను అమ్మేస్తుంది. ఏపీ శ్రీకాకుళంలో బాయ్ ఫ్రెండ్ హైదరాబాద్ చింతల్ లో లవర్ నివాసం ఉంటు హష్ అయిల్ మత్తు దందాను నడిపిస్తున్నారు. కొంత మంది యువకులు గంజాయి తాగుతున్నారని సమాచారం రావడంతో నిఘా వేసిన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు లవర్స్ కలిసి చేస్తున్న మత్తు దందా విషయం వెలుగులోకి వచ్చింది. ప్రియురాలిని అరెస్టు చేయగా, బాయ్ ఫ్రెండ్ పరారీలో ఉన్నాడు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర బాబు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏపీ శ్రీకాకుళంకు చెందిన నవ్య హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నానని చెప్పి వచ్చేసింది.
శ్రీకాకుళంకు చెందిన బాయ్ ఫ్రెండ్ తో హైదరాబాద్ లో నెలకో ఇంటిని మారుస్తు అతనితో సహీజీవనం చేస్తుంది. బాయ్ ఫ్రెండ్ ఏపీ శ్రీకాకుళం నుంచి హష్ అయిల్ ను తీసుకువచ్చి నవ్య దగ్గర పెడతాడు. స్నాప్ చాట్, టెలిగ్రాం, వాట్సాప్ కాల్స్ ద్వారా వినియోగదారులను సంప్రదించి నవ్య ఉన్న లొకేషన్ ను షేర్ చేస్తాడు. మత్తు బాబులు అక్కడికి వెళ్ళి నవ్య నుంచి హాష్ అయిల్ ను తీసుకుని వెళ్ళిపోతారు. ఇలా కొంత కాలం నుంచి ఈ దందాను జోరుగా కొనసాగిస్తున్నారు.
5ఎంఎల్ డబ్బాను వెయ్యి రూపాయాలకు ఏపీ నుంచి తీసుకువచ్చి నగరంలో 2 వేలకు అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మాసబ్ ట్యాంక్ ప్రాంతానికి చెందిన మహ్మాద్ ఫైజాన్ తో పాటు మరికొంతమందిని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించడంతో నవ్య లింక్ బయటపడింది. నవ్య నుంచి హాస్ అయిల్ తీసుకుంటున్న మహ్మాద్ ఫైజాన్ తో పాటు వీరాచారీ, సామ్ అజయ్ కుమార్, వి.హర్షిత్, మహ్మాద్ సమీర్, సామ్ విజయ్ కుమార్ సయ్యద్ ముర్తుజాలను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 75 బాటిళ్ళ హాస్ అయిల్ , 3 గ్రాముల చరస్, రెండు కత్తులు, 175 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.






