- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య.. అసలు కారణం ఏంటంటే
by Batti.Sumithra |
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని శ్రీ హిందూ గడ్డి మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

X
దిశ, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని శ్రీ హిందూ గడ్డి మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. గత నాలుగు రోజుల క్రితం పాఠశాలలో జరిగిన కొన్ని సంఘటనలతో మనస్తాపానికి గురై పాఠశాలలోనే పురుగుల మందు సేవించినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న సిబ్బంది మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల జిల్లా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఆమెను చేర్పించారు. అయితే నాలుగు రోజుల చికిత్స అనంతరం ఆదివారం విద్యార్థిని మృతి చెందింది. విద్యార్థిని ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






