- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖలో కాల్పుల కలకలం.. ఇండియన్ నేవీ సోల్జర్ దుర్మరణం
ప్రశాంత నగరంగా పేరుగాంచిన విశాఖలో కాల్పలు కలకలం రేపుతున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రశాంత నగరంగా పేరుగాంచిన విశాఖలో కాల్పలు కలకలం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఇవాళ భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో నౌకాదళ ప్రాంగణంలో ఆకస్మాత్తుగా ఓ సైనికుడు గన్‌తో పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దుర్ఘటనలో గుంటూరు (Guntur)కు చెందిన ఇండియన్ నేవీ సోల్జర్ బాజీ షేక్ (45) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆత్మహత్యకు గల కారణాలను వెలికితీసే పనిలో వారు నిమగ్నమయ్యారు. అయితే, మృతుడు బాజీ షేక్ ఐఎన్ఎస్ కళింగ (INS Kalinga)లో డిఫెన్స్ సెక్యూరిటీ కోర్ గార్డ్‌గా విధులు నిర్వర్తిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Next Story






