పోచారంలో కాల్పుల కలకలం

by Muthe.Rajitha |   (  Updated:2025-10-22 14:26:25  IST  )

మేడ్చల్ జిల్లాలో కాల్పుల కలకలం రేగింది.

పోచారంలో కాల్పుల కలకలం
X

దిశ, వెబ్ డెస్క్ : మేడ్చల్ జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. జిల్లాలోని పోచారం ఐటీ కారిడార్ పీఎస్ పరిధిలోని యనంపేట వద్ద గల గణపతి విగ్రహాల తయారీ షెడ్లలో ఓ వ్యక్తిపై కాల్పులు జరిపిన సంఘటన సంచలనం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, బాధితున్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కాల్పులు జరిపిన నిందితుడు ఇబ్రహీంగా గుర్తించిన పోలీసులు... అతనికోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story