- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాట్నాలో కాల్పుల కలకలం..గన్స్‌తో ఆస్పత్రికి వెళ్లి దారుణం
బీహార్ రాజధాని పాట్నాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ ఖైదీని దుండగులు గన్ తో కాల్చి చంపారు. సినిమా రేంజ్ లో ఈ దాడి జరగ్గా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్: బీహార్ రాజధాని పాట్నాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ ఖైదీని దుండగులు గన్ తో కాల్చి చంపారు. సినిమా రేంజ్ లో ఈ దాడి జరగ్గా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ హత్య కేసులో చందన్ మిశ్రా అనే నింధితుడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం మిశ్రా 15 రోజుల పెరోల్ పై ఉండి, ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఐదుగురు దుండగులు అతడి వద్దకు గన్స్ తో వచ్చారు. ఐదుగురి వద్ద కూడా గన్ ఉండగా రూంలోకి వెళ్లే ముందే బుల్లెట్స్ లోడ్ చేసుకున్నారు. గదిలోకి వెళ్లి మిశ్రాపై కాల్పులు జరపగా అక్కడిక్కడే మరణించాడు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో భయానకంగా ఉండగా, బిహార్ లో ఇలాంటి పరిస్థితి ఉంటుందా అని చూసినవాళ్లు షాక్ అవుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. వీడియో






