గుజరాత్‌లో దారుణం.. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఆ తర్వాత క్షుద్రపూజలు చేసి.. చివరకు

by Sujitha Rachapalli |

గుజరాత్‌ ఆనంద్ జిల్లా అంక్లావ్ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి.. నదిలో పడేసిన ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. బాధిత కుటుంబానికి దగ్గరి బంధువైన వ్యక్తి చిన్నారిపై లైంగిక దాడి చేసి..

గుజరాత్‌లో దారుణం.. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఆ తర్వాత క్షుద్రపూజలు చేసి.. చివరకు
X

దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్‌ ఆనంద్ జిల్లా అంక్లావ్ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి.. నదిలో పడేసిన ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. బాధిత కుటుంబానికి దగ్గరి బంధువైన వ్యక్తి చిన్నారిపై లైంగిక దాడి చేసి.. ఆ తర్వాత వడోదర సమీపంలోని మినీ నదిలో విసిరేశాడు. కాగా సీసీటీవీ ఫుటేజీలో నిందితుడు బాధితురాలిని బైక్‌పై తీసుకెళ్తున్న విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కేసును ఛేదించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నిజం ఒప్పుకున్నాడు. కాగా పాప శవాన్ని వెతికేందుకు ప్రయత్నిస్తున్నా.. భారీ వర్షాల కారణంగా ప్రక్రియ ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.

అయితే స్థానికులు నిందితుడు తాంత్రిక శక్తులు కలిగి ఉన్నాడని.. పాపపై క్షుద్రపూజలు చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఇంతకు ముందు నిందితుడి భార్య గర్భవతిగా ఉన్నప్పుడు.. పుట్టిన బిడ్డను బలి ఇచ్చేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. కానీ పోలీసులు ఈ విషయాన్ని తోసిపుచ్చారు. లైంగిక దాడిగా పరిగణిస్తున్నారు.

Next Story