- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రామపంచాయతీ పోరు.. బలైన మహిళ
స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు చోట్ల ఓటు హక్కు వినియోగించుకున్నావు అంటూ రంగాపూర్ సర్పంచ్ అభ్యర్థి కలబోయిన నరేందర్ మోనారీ.. రాధమ్మ(61) అనే మహిళకు పెద్దపల్లి జూనియర్ సివిల్ కోర్టు ద్వారా నోటీస్ పంపించాడు.

దిశ, కమాన్ పూర్ : ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో రెండు చోట్ల ఓటు హక్కు వినియోగించుకున్నావు అంటూ రంగాపూర్ సర్పంచ్ అభ్యర్థి కలబోయిన నరేందర్ మోనారీ.. రాధమ్మ(61) అనే మహిళకు పెద్దపల్లి జూనియర్ సివిల్ కోర్టు ద్వారా నోటీస్ పంపించాడు. తీవ్ర మనస్థాపానికి గురై రంగాపూర్ ఎస్ఆర్ఎస్పీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మోనారీ రాధమ్మ కమాన్పూర్ మండలం గొల్లపల్లి గ్రామపంచాయతీ. సింగరేణి ఉద్యోగం రిత్యా పెద్దపల్లి రంగాపూర్ గ్రామపంచాయతీలో సొంత ఇల్లు నిర్మించుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు. రాధమ్మ భర్త రాజయ్య 2020లో మరణించాడు. ఈమెకు సింగరేణి లో పెన్షన్ కూడా లభిస్తోంది. ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని ఆమె కుమారులు తెలిపారు. మొదటి విడత ఎన్నికల్లో గొల్లపల్లి గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకొని.. మూడో విడుత రంగాపూర్ గ్రామపంచాయతీలో ఓటు హక్కు వినియోగించుకుందని ఆరోపిస్తూ రంగాపూర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కలబోయిన నరేందర్ రాధమ్మ పై పెద్దపల్లి జూనియర్ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈనెల 17న నోటీసులు అందుకుంది రాధమ్మ. ఈనెల 20న మరోసారి నోటీస్ రావడంతో తీవ్ర భయాందోళనకు గుర రాధమ్మ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. మరోవైపు సర్పంచ్ అభ్యర్థి నరేందర్ తమ్ముడు కలబోయిన విజేందర్ గొల్లపల్లిలో ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతను మా తల్లిని బెదిరించాడని పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు ఎస్సై మల్లేష్ తెలిపారు.






