- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తరగతి గదిలో ఉపాధ్యాయుడి రాసలీలలు
మధ్యప్రదేశ్ దేవాస్ పాఠశాల ఉపాధ్యాయుడి అశ్లీల వీడియో వైరల్ అవుతోంది. బిసాలి గ్రామ పంచాయతీ ఝిరి మొహల్లాలోని ఉదయనగర్ కాంప్లెక్స్‌లోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు విక్రమ్ కదమ్ తరగతి గదిలోనే రొమాన్స్ చేశాడు. ఓ మహిళతో ఎంజాయ్

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ దేవాస్ పాఠశాల ఉపాధ్యాయుడి అశ్లీల వీడియో వైరల్ అవుతోంది. బిసాలి గ్రామ పంచాయతీ ఝిరి మొహల్లాలోని ఉదయనగర్ కాంప్లెక్స్‌లోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు విక్రమ్ కదమ్ తరగతి గదిలోనే రొమాన్స్ చేశాడు. ఓ మహిళతో ఎంజాయ్ చేస్తుండగా చూసిన విద్యార్థులు వీడియో తీశారు. మహిళ మెడ చుట్టూ చేయి వేసి పిచ్చి పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా ఇలాంటి పనులు చేస్తున్నాడనే కంప్లయింట్స్ ఉన్నా ఎవరు పట్టించుకోకపోవడంతో ఆయన ఆగడాలు ఎక్కువయ్యాయని చెప్తున్నారు గ్రామస్తులు. రెండు రోజుల ముందే దీనిపై గ్రామంలో పంచాయితీ నిర్వహించినా తప్పు ఒప్పుకోని టీచర్.. మళ్లీ అదే పని చేస్తూ పట్టుబడినట్లు తెలుస్తోంది. ఎవరు చర్య తీసుకోవడం లేదనే ధైర్యమే ఇందుకు కారణమని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు.
ఇక ఈ వీడియో జిల్లా విద్యాధికారి దృష్టికి వెళ్లగా దీనిపై విచారణ జరిపి విక్రమ్ కదమ్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే ఉపాధ్యాయుడు మాత్రం ఇది తన వీడియో కాదని.. ఏఐ జనరేటెడ్ వీడియో అని చెప్తున్నాడు. ఎవరో కావాలనే తనను ఇరికిస్తున్నారని.. తన పరువు తీసేందుకు కుట్ర పన్నుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.






