రూ. 15000 ఇస్తా వస్తవా.. ఉపాధ్యాయుడి రాసలీలలు..

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని సికందరాలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ రెస్టారెంట్‌ ముందు స్నేహితురాలితో నిలబడిన యువతిని పట్టుకుని రూ. 15000 ఇస్తా వస్తావా అని బలవంతం చేశాడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్యామ్ వీర్ సింగ్.

రూ. 15000 ఇస్తా వస్తవా.. ఉపాధ్యాయుడి రాసలీలలు..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని సికందరాలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ రెస్టారెంట్‌ ముందు స్నేహితురాలితో నిలబడిన యువతిని పట్టుకుని రూ. 15000 ఇస్తా వస్తావా అని బలవంతం చేశాడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్యామ్ వీర్ సింగ్. ఆ అమ్మాయి వ్యతిరేకించడంతో పిస్టల్‌తో బెదిరించాడు. కారులో బలవంతంగా ఎక్కించేందుకు ప్రయత్నించాడు. కానీ యువతి ధైర్యంగా తిడుతూ అరవడంతో జనం గుమిగూడారు. దీంతో నిందితుడు పారిపోయాడు.

ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆగ్రా పోలీసులు తక్షణమే స్పందించారు. శ్యామ్ వీర్ సింగ్‌ను అరెస్ట్ చేయడంతోపాటు ఆమెను కిడ్నాప్ చేసేందుకు ఉపయోగించిన కారు, లైసెన్స్‌డ్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అమ్మాయి ఫిర్యాదుతో సికందరా పీఎస్‌లో స్త్రీని వేధింపును గురిచేయడం, బెదిరింపులు, మర్డర్ అటెంప్ట్ కింద కేసు నమోదైంది.

Next Story