- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నువ్వు రా.. లేదంటే.. మరో అమ్మాయిని పంపు.. ఆరోగ్య శాఖలో దుమారం రేపుతున్న ఆడియో
ఉత్తరప్రదేశ్ సుల్తాన్‌పూర్ జిల్లా కాదీపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నాడు గవర్నమెంట్ డాక్టర్ అనిల్ కుమార్. ఇంతకు ముందు లంభువాలో పని చేసిన ఆయన

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ సుల్తాన్‌పూర్ జిల్లా కాదీపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నాడు గవర్నమెంట్ డాక్టర్ అనిల్ కుమార్. ఇంతకు ముందు లంభువాలో పని చేసిన ఆయన అక్టోబర్ 13న ట్రాన్స్‌ఫర్ అయ్యాడు. అయితే కాదీపూర్‌లో పని చేసినప్పుడు నర్సుతో అసభ్యకరంగా మాట్లాడిన ఫోన్ కాల్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆడియోలో డాక్టర్.. మూడు నెలలుగా ఇంటికి వెళ్లలేదని.. మూడ్ సరిగ్గా లేదని చెప్పాడు. తనకో ఫేవర్ చేయాలని.. డబ్బు ఇస్తానని తెలిపాడు. ఈ మాటలను వ్యతిరేకించిన నర్సు..ఇలాంటివి మాట్లాడితే ఉద్యోగం వదిలేస్తానని చెప్పింది. కానీ కంటిన్యూ చేసిన డాక్టర్.. ‘ నువ్వు రా.. లేదంటే మరో అమ్మాయిని పంపు.. డబ్బు ఇస్తా.. సెక్స్ వర్కర్స్ రావట్లేదు.. నీలాంటి అమ్మాయి కావాలి’ అని చెప్పాడు.
ఈ ఆడియో కాల్‌ను నర్సు సుల్తాన్‌పూర్‌లోని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భరత్ భూషణ్‌కు సమర్పించింది. చర్యలు తీసుకోవాలని కోరింది. విచారణ కోసం ఓ బృందాన్ని ఏర్పాటు చేయగా.. ఇరువైపుల స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. విచారణ తర్వాత రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉది. కాగా ఈ ఆడియో కాల్ ప్రస్తుతం ఆరోగ్య శాఖలో దుమారం రేపుతోంది. వర్క్ ప్లేస్‌లో మహిళలపై లైంగిక వేధింపుల గురించి చర్చకు దారితీసింది.






