పురుష నాళంలో బంగారం పేస్ట్.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుడి అరెస్ట్..

by Disha Web Desk 11 |
పురుష నాళంలో బంగారం పేస్ట్.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుడి అరెస్ట్..
X

దిశ, శంషాబాద్: గుట్టు చప్పుడు కాకుండా విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మస్కట్ నుంచి (WY-231) విమానంలో హైదరాబాద్ వచ్చేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో వచ్చిన ప్రయాణికులను తనిఖీలు నిర్వహిస్తుండగా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ప్రయాణికుడిపై అనుమానం వచ్చి లగేజీ బ్యాగును, వ్యక్తిని స్కానింగ్ చేయడంతో వ్యక్తి వద్ద బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.

ప్రయాణికుడు బంగారం పేస్టును తన పురుష నాళంలో పెట్టుకొని అక్రమంగా తరలిస్తుండగా ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి రూ. 42 లక్షల 78 వేల 768ల విలువ జేసే 685.7 గ్రాముల బంగారంను స్వాధీనం చేసుకొని ప్రయాణికుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.



Next Story

Most Viewed