- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్యాంకులో బంగారం మాయం.. ఖాతా దారుల ఆందోళన
బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం మాయం అవ్వడంతో ఖాతా దారులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరు యూనియన్ బ్యాంక్ లో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం మాయం అవ్వడంతో ఖాతా దారులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరు యూనియన్ బ్యాంక్ లో చోటు చేసుకుంది. బ్యాంక్ మేనేజర్ ప్రభావతే బంగారం మాయం అవ్వడానికి కారణం అని ఖాతా దారులు ఆరోపిస్తున్నారు. నాగేంద్ర బాబు అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టగా ఏడాది క్రితం అతడు మరణించాడు. దీంతో కుటుంబ సభ్యులు ఇటీవల తమ బంగారం విడిపించుకునేందుకు బ్యాంకుకు వెళ్లగా అక్కడ గోల్డ్ లేకపోవడంతో ఆశ్యర్యానికి గురయ్యారు.
అంతే కాకుండా నాగేంద్ర బాబు తాకట్టుపెట్టిన బంగారానికి నామినీగా బ్రాంచ్ మేనేజర్ ప్రభావతి పేరు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఇటీవల ఓ మహిళ నాగేంద్రబాబు డెత్ సర్టిఫికెట్ తీసుకువచ్చి బంగారం విడిపించుకుపోయిందని సిబ్బంది బాధితులకు తెలిపారు. దీంతో బాధితులు బ్యాంకు ముందు ఆందోళనకు దిగారు. తమ కుటుంబ సభ్యుల పేర్లు కాకుండా బ్యాంకు మేనేజర్ పేరు ఎలా నామినీగా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. తమ బంగారం తమకు కావాలని డిమాండ్ చేస్తున్నారు.






