చేపల వేటకు వెళ్లి మృత్యువొడిలోకి..!

by Ratna Kumari |

చేపల వేటకు వెళ్లిన వ్యక్తి నీటిలో మునిగి మృత్యు వొడిలోకి జారుకున్న ఘటన మాచారెడ్డి మండలం సోమార్పేట గ్రామ పరిధిలోని రోటి బండ తండాలో చోటు చేసుకుంది.

చేపల వేటకు వెళ్లి మృత్యువొడిలోకి..!
X

దిశ, మాచారెడ్డి : చేపల వేటకు వెళ్లిన వ్యక్తి నీటిలో మునిగి మృత్యు వొడిలోకి జారుకున్న ఘటన మాచారెడ్డి మండలం సోమార్పేట గ్రామ పరిధిలోని రోటి బండ తండాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బుక్యా బన్సీ (49) అనే గిరిజనుడు రోటి బండ తండా గ్రామ చెరువులో చేపలు పట్టే సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. సహచరులు వెంటనే అతని రక్షించడానికి విఫలయత్నం చేశారు. శుక్రవారం సాయంత్రం నీట మునిగిన బుక్యా బన్సీ మృతదేహం శనివారం మధ్యాహ్నం గ్రామ చెరువులో తేలియాడుతూ కనిపించింది. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు మాచారెడ్డి ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.

Next Story