ప్రియుడికి బైక్ కొనివ్వడానికి దొంగగా మారిన ప్రేయసి.. చివరికి ఊహించని ట్విస్ట్!

by Ajay Maddhiboyina |

ప్రియుడికి బైక్ కొనివ్వ‌డానికి అత‌డి ప్రియురాలు దొంగ‌గా మారింది. అంతే కాకుండా బంధువుల ఇంటికే క‌న్నం వేసి చివ‌ర‌కు దొరికిపోయింది.

ప్రియుడికి బైక్ కొనివ్వడానికి దొంగగా మారిన ప్రేయసి.. చివరికి ఊహించని ట్విస్ట్!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రియుడికి బైక్ కొనివ్వ‌డానికి అత‌డి ప్రియురాలు దొంగ‌గా మారింది. అంతే కాకుండా బంధువుల ఇంటికే క‌న్నం వేసి చివ‌ర‌కు దొరికిపోయింది. ఈ ఘ‌ట‌న ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో చోటు చేసుకుంది. విశ్వ‌క‌ర్మ‌, క‌రుణ ప‌టేల్ ఇద్ద‌రూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ప్రియుడు అడిగాడో లేదంటే అత‌డికి బండి లేద‌ని ప్రియురాలే బాధ‌ప‌డిందో కానీ అత‌డికి ఎలాగైనా కొనివ్వాల‌ని నిర్ణ‌యించుకుంది. కానీ కొనివ్వ‌డానికి చేతిలో డ‌బ్బులు లేవు.. ఈఎంఐ క‌ట్టైనా కొనిద్దామా అంటే ఉద్యోగం లేదు. దీంతో ఏం చేయాలో తెలియ‌క త‌న బంధువుల ఇంటికి క‌న్నం వేసింది.

ప్రియురాలే ఆమె బంధువుల ఇంటికి క‌న్నం వేద్దామ‌ని స్కెచ్ వేయ‌డంతో ప్రియుడు కూడా దానికి అంగీక‌రించాడు. ఇంకేముందు త‌న బంధువుల‌ ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యం చూసిన కరుణ ప‌టేల్ ప్రియుడికి స‌మాచారం అందించింది. ఇద్ద‌రూ క‌లిసి తాళం ప‌గ‌ల‌గొట్టి ఇంట్లోకి దూరి రూ.2 ల‌క్ష‌ల విలువైన ఆభ‌ర‌ణాలు, రూ.95 న‌గ‌దును దొంగలించారు. ఈ ఘ‌ట‌న‌పై యువ‌తి బంధువులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా రంగంలోకి దిగి విచార‌ణ జ‌రిపారు. క‌రుణ ప‌టేల్ పై అనుమానం రావ‌డంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తానే ప్రియుడితో క‌లిసి దొంగ‌తనానికి పాల్ప‌డిన‌ట్టు ప్రియురాలు అంగీక‌రించింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు ఇద్ద‌రిని అరెస్ట్ చేసి కాంకేర్ జిల్లా జైలుకు త‌ర‌లించారు.

Next Story