పూణేలో దారుణం..డెలివరీ బాయ్‌ని అంటూ వచ్చి యువతిపై అత్యాచారం

by Ajay Maddhiboyina |

పూణేలో దారుణం జరిగింది. ఒంటరి యువతిపై డెలివరీ బాయ్ అని చెప్పుకుని వచ్చిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా మళ్లీ వస్తానంటూ ఆమె ఫోన్‌లో టైప్ చేసి మరీ వెళ్లాడు.

పూణేలో దారుణం..డెలివరీ బాయ్‌ని అంటూ వచ్చి యువతిపై అత్యాచారం
X

దిశ, వెబ్ డెస్క్: పూణేలో దారుణం జరిగింది. ఒంటరి యువతిపై డెలివరీ బాయ్ అని చెప్పుకుని వచ్చిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా మళ్లీ వస్తానంటూ ఆమె ఫోన్‌లో టైప్ చేసి మరీ వెళ్లాడు. ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోష్ రెసిడెన్షియల్ సొసైటీలో ఓ యువతి తన సోదరుడితో కలిసి ఉంటోంది. కాగా బుధవారం రాత్రి 7గంటలకు ఎవరూ లేని సమయంలో ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి తాను డెలివరీ బాయ్ అని బ్యాంకుకు సంబంధించి పత్రాలు కొరియర్ ఇచ్చేందుకు వచ్చినట్టు చెప్పాడు.

పెన్ కావాలని అడగ్గా యవతి బెడ్ రూంలోకి వెళ్లింది. ఆమె వెనకాలే రూంలోకి వెళ్లిన అతడు మత్తుమందు చ‌ల్లి స్పృహ కోల్పోయిన త‌ర‌వాత అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. అంతే కాకుండా ఆమెతో సెల్ఫీ తీసుకుని బాధితురాలి ఫోన్ లోనే మ‌ళ్లీ వ‌స్తానంటూ టెక్స్ట్ రాసి వెళ్లిపోయాడు. స్పృహ‌లోకి వ‌చ్చిన త‌ర‌వాత యువ‌తి పోలీస్ స్టేష‌న్ వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘ‌ట‌న‌ను పూణే పోలీసులు సీరియ‌స్ గా తీసుకున్నారు. ఐదు బృందాలుగా విడిపోయి నింధితున్ని ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఫోన్ లో దిగిన సెల్ఫీ ఆదారంగా పోలీసులు నింధితుడిని పట్టుకునే ప‌నిలో ఉన్నారు.

Next Story