- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియుడితో పెళ్లి కోసం.. 27 మంది కుటుంబసభ్యులకు విషం పెట్టి.. చంపిన బిడ్డ..
పాకిస్తాన్ ముజఫ్ఫర్‌గఢ్‌లో ఓ యువతికి ఇష్టం లేకుండా వివాహం ఫిక్స్ చేశారు ఫ్యామిలీ మెంబర్స్. దీంతో ఆ అమ్మాయి ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఏకంగా కుటుంబంలోని 27 మందికి విషం పెట్టింది. తాగే పాలలో ఎలుకల మందు కలిపింది.

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ ముజఫ్ఫర్‌గఢ్‌లో ఓ యువతికి ఇష్టం లేకుండా వివాహం ఫిక్స్ చేశారు ఫ్యామిలీ మెంబర్స్. దీంతో ఆ అమ్మాయి ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఏకంగా కుటుంబంలోని 27 మందికి విషం పెట్టింది. తాగే పాలలో ఎలుకల మందు కలిపింది. తను ఆల్రెడీ ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నానని.. తనతోనే పెళ్లి చేయాలని కోరింది అసియా బీబీ. కజిన్ అజ్మద్‌తో మ్యారేజ్ చేసేందుకు ట్రై చేస్తే.. దీన్ని బ్రేక్ చేసేందుకు ఎంత దూరమైనా వెళ్తానని చాలా సార్లు హెచ్చరించింది. కానీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వినలేదు.
దీంతో తనను పెళ్లి చేసుకోబోయే అజ్మద్‌తో సహా అందరికీ విషం కలిపిన పాలు ఇవ్వగా.. ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో అజ్మద్‌తోసహా 18 మంది అస్వస్థతకు గురికాగా.. అజ్మద్ అన్నలు, వదినలతో సహా తొమ్మిది మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన గతేడాది జరగ్గా ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. కాగా ఈ కేసులో అసియా లవర్ షాహిద్ హస్తం కూడా ఉండగా.. వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.






