సైబర్ నేరగాళ్లే కాదు.. దోస్తులతోను జాగ్రత్త

by Malleboina Mahesh |   (  Updated:2025-10-14 03:24:55  IST  )

సైబర్ నేరగాల్లే కాదు.. తనతో స్నేహం చేస్తున్న దోస్తులతోను అమ్మాయిలు ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే ఢిల్లీలో జరిగిన ఓ సంఘటన అందరిని షాక్‌కు గురి చేసింది.

సైబర్ నేరగాళ్లే కాదు.. దోస్తులతోను జాగ్రత్త
X

దిశ, వెబ్ డెస్క్: సైబర్ నేరగాల్లే కాదు.. తనతో స్నేహం చేస్తున్న దోస్తులతోను అమ్మాయిలు ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే ఢిల్లీలో జరిగిన ఓ సంఘటన అందరిని షాక్‌కు గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియాలో పరిచయం అయిన ఓ యువతి, మరో యువతితో స్నేహం చేసింది. తన పర్సనల్ విషయాలను బాధిత యువతితో పంచుకుంది. అనంతరం కొద్ది రోజులకు వారి మధ్య స్నేహం పెరిగిపోయింది. దీంతో సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన యువతి.. మరో యువతి ప్రైవేట్ వీడియోలు, ఫోటోలను పంచుకోవడానికి ఒప్పించింది. అనంతరం ఇరువురు వారి వారి ప్రైవేట్ కంటెంట్‌ను పంచుకున్నారు.

దీంతో ఆన్ లైన్ లో పరిచయం అయిన యువతి అసలు రంగు బయటపడింది. తాను అడిగినంత డబ్బులు ఇవ్వక పోతే.. తనతో పంచుకున్న ప్రైవేట్ కంటెంట్‌ను యువతి బంధువులకు షేర్ చేస్తానని బెదిరించింది. దీంతో ఆ యువతి వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో.. అసలు విషయం బయట పడింది. మనోజ్ వర్మ అనే యువకుడు సోషల్ మీడియాలో ఫేక్ మహిళా ప్రొఫైల్ ను క్రియేట్ చేసుకొని ఇదంతా చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు నేరంలో ఉపయోగించిన వాట్సాప్ చాట్‌లు, అశ్లీల వీడియోలు, నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలను కలిగి ఉన్న ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటన యువతులకు స్పష్టమైన హెచ్చరికగా నిలిచింది. ఆన్‌లైన్‌లో ఎవరి పట్లనైనా పూర్తి నమ్మకం ఉంచకూడదు, ప్రత్యేకంగా వ్యక్తిగత సమాచారం, ప్రైవేట్ కంటెంట్ పంచుకునే ముందు అనేక సార్లు ఆలోచించాలి. స్నేహం పేరుతో మోసగాళ్లు దగ్గరయ్యే అవకాశాన్ని గుర్తించి జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి అని ఢిల్లీలో జరిగిన ఈ మోసం దేశవ్యాప్తంగా ఉన్న యువతి యువకులకు హెచ్చరికలు జారీ చేస్తుంది.

READ MORE ......

తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరీ.. బంగారు నగలు, నగదు అపహరణ

Next Story