కోదాడ పోలీసుల చాకచక్యం.. 11 కేజీల గంజాయితో ఇద్దరు యువకులు అరెస్ట్

by Bhanu |

గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో కోదాడ రూరల్ పోలీసులు మరో విజయవంతమైన ఆపరేషన్ నిర్వహించారు.

కోదాడ పోలీసుల చాకచక్యం.. 11 కేజీల గంజాయితో ఇద్దరు యువకులు అరెస్ట్
X

దిశ, కోదాడ: గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో కోదాడ రూరల్ పోలీసులు మరో విజయవంతమైన ఆపరేషన్ నిర్వహించారు. ఇద్దరు యువకులు పెద్ద మొత్తంలో గంజాయిని దాచి విక్రయించే ప్రయత్నంలో అరెస్టయ్యారు. ఈ కేసు వివరాలను సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ శనివారం మీడియాకు వెల్లడించారు.

అడప రాకేష్ (కోదాడ మండలం ద్వారకుంట గ్రామం) అనే యువకుడు గతంలో గంజాయి కేసులో జైలు శిక్ష అనుభవించి, తాజాగా ఓ కోర్టు వాయిదా సమయంలో ఒడిశా రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఆయన 11 కేజీల గంజాయిని రూ.11,000కి కొనుగోలు చేసి, తన గ్రామ శివారులోని చెట్ల పొదల మధ్య దాచి ఉంచాడు.

ఈ గంజాయిని తరచూ కొనేవాడైన వనపర్తి సాయికుమార్ అనే యువకుడికి సమాచారం ఇచ్చి, 1 కేజీ గంజాయిని విక్రయించే క్రమంలో ఇద్దరూ పోలీసులు చేతికి చిక్కారు. వారి వద్ద నుంచి మొత్తం 9.9 కేజీలు గంజాయి, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.2.80 లక్షలు ఉంటుంది.

పూర్తి బృందం పని తీరును ఎస్పీ ప్రశంసించారు. ఇందులో సీఐ రజితా రెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్‌ఐ అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారికి రివార్డులు కూడా ప్రకటించారు.


Next Story