గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్..

by Bhanu |

అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్..
X

దిశ, జగిత్యాల టౌన్: అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం నమ్మదగిన సమాచారంతో పక్కా కార్యాచరణ చేపట్టిన జగిత్యాల టౌన్ సీఐ కరుణాకర్ సిబ్బందితో కలిసి పట్టణంలోని గొల్లపల్లి ఎక్స్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు.


ఈ తనిఖీల సమయంలో ఓ ఆటోను ఆపి పరిశీలించగా అందులో 1.5 కేజీల నిషేధిత గంజాయి పట్టుబడింది. విచారణలో నిందితుడిని మహమ్మద్ రషీద్‌గా గుర్తించారు. ఆయన వాహనం, గంజాయిని స్వాధీనం చేసుకుని పంచుల సమక్షంలో పంచనామ నిర్వహించి కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

Next Story