ఒడిశా టు మహారాష్ట్ర వయా తెలంగాణ... క్వింటాళ్ల కొద్దీ గంజాయి స్మగ్లింగ్

by Muthe.Rajitha |

ప్రభుత్వాలు ఎంత కఠిన చర్యలు తీసుకున్నా... డ్రగ్స్ దందా మాత్రం ఆగడం లేదు.

ఒడిశా టు మహారాష్ట్ర వయా తెలంగాణ... క్వింటాళ్ల కొద్దీ గంజాయి స్మగ్లింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రభుత్వాలు ఎంత కఠిన చర్యలు తీసుకున్నా... డ్రగ్స్ దందా మాత్రం ఆగడం లేదు. కొత్త కొత్త పద్ధతుల్లో స్మగ్లర్స్ రాష్ట్రాలు దాటిస్తూ యధేచ్చగా డ్రగ్స్ అమ్ముతున్నారు. అయిఠె నేడు సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరువులో తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్స్ బ్యూరో (TSNAB), BDL భానూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో 128 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంత భారీ మొత్తంలో అక్రమ రవాణా చేస్తున్న దుండగులు తెలంగాణ గుండా అనేక రాష్ట్రాలకు చేరవేస్తున్నారు.

నేడు పట్టుకున్న గంజాయి ఒడిశా నుంచి మహారాష్ట్రకు వయా తెలంగాణ నుంచి తరలిస్తున్న క్రమంలో స్పెషల్ ఆపరేషన్ చేపట్టి, గంజాయి రవాణా ముఠాను పట్టుకున్నారు. ఈ గంజాయిని ప్రత్యేకంగా రూపొందించిన కార్లలోని రహస్య క్యాబిన్‌లలో దాచి రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని, గంజాయి సరఫరా నెట్‌వర్క్‌పై లోతైన దర్యాప్తు చేపట్టారు.

Next Story