గంజాయి విక్రయిస్తున్న యువకులు అరెస్ట్

by Bhanu |   (  Updated:2025-07-25 14:11:52  IST  )

మండలంలోని గూడెం గ్రామ శివారులో రహస్యంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

గంజాయి విక్రయిస్తున్న యువకులు అరెస్ట్
X

దిశ, ముస్తాబాద్: మండలంలోని గూడెం గ్రామ శివారులో రహస్యంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సిరిసిల్ల ఎస్సై గణేష్ కు వచ్చిన సమాచారం మేరకు, గూడెం గ్రామానికి చెందిన సూర అజయ్, సూర ప్రదీప్ లు గంజాయి కొనుగోలు చేసి, దాన్ని గంజాయి సేవించే వారికి తరచుగా అమ్ముతూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు.

గురువారం పెద్దమ్మ దేవాలయం సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఈ ఇద్దరిని గమనించిన పోలీసులు, తక్షణమే అక్కడికి చేరుకొని తనిఖీలు నిర్వహించారు. వారి వద్ద 109 గ్రాముల గంజాయి ఉండటాన్ని గుర్తించి, దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

తదుపరి విచారణ అనంతరం నిందితులను శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు సిరిసిల్ల సీఐ మొగిలి తెలిపారు. మండలంలో నిషేధిత గంజాయిని కొనుగోలు, విక్రయాలు, సేవనకు పాల్పడిన వారు కఠిన శిక్షలు ఎదుర్కోవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. యువత ఇలాంటి అలవాట్లను దూరంగా ఉంచుకోవాలని సూచించారు.

Next Story