హుజూర్‌నగర్‌ పోలీసుల దాడి.. గంజాయి కొనుగోలు, విక్రయంలో నలుగురు అరెస్టు

by Bhanu |   (  Updated:2025-07-04 13:58:05  IST  )

గంజాయి కొనుగోలు చేసి పంచుకుంటున్న ముగ్గురు వ్యక్తులతో పాటు, వారికిగంజాయి అమ్మిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన

హుజూర్‌నగర్‌ పోలీసుల దాడి.. గంజాయి కొనుగోలు, విక్రయంలో నలుగురు అరెస్టు
X

దిశ, హుజూర్ నగర్ : గంజాయి కొనుగోలు చేసి పంచుకుంటున్న ముగ్గురు వ్యక్తులతో పాటు, వారికిగంజాయి అమ్మిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన శుక్రవారం హుజూర్‌నగర్ పట్టణ పోలీస్‌ స్టేషన్లో విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. సీఐ చరమంద రాజాతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వివరాలను తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే.. చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి చెందిన గణపవరపు శ్రీకాంత్, ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని ముష్టికుంట గ్రామానికి చెందిన బొట్ల బాలకృష్ణ (ప్రస్తుతం హుజూర్‌నగర్‌లో నివాసం), హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన షేక్ నజీర్ అనే ముగ్గురు వ్యక్తులు గరిడేపల్లి మండలం రాయినిగూడెం గ్రామ శివారులో గల డంపింగ్‌యార్డు వద్ద గంజాయి పంచుకుంటున్నారని సమాచారం అందడంతో ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

వారు TS15FC9289 నంబరు గల పల్సర్ బైక్‌పై వచ్చి గంజాయి ప్యాకెట్లను పంచుకుంటుండగా పట్టుకున్నారు. వారి వద్ద నుండి 330 గ్రాముల గంజాయి, ఒక బైక్, బాలకృష్ణ నుండి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో గంజాయి సరఫరాదారుడిగా గణపవరపు శ్రీకాంత్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు.

శ్రీకాంత్ ఇచ్చిన మెలుకువల మేరకు, అతను సీలేరు ప్రాంతానికి వెళ్లి కార్తీక్ అనే వ్యక్తి వద్ద నుండి రూ.8000కు 4 కేజీల గంజాయి కొనుగోలు చేసినట్లు తెలిపాడు. గత నెల 29న ఈ ముగ్గురికీ రూ.1000 విలువైన గంజాయి అమ్మగా, శుక్రవారం మరోసారి రూ.3000 విలువైన గంజాయి అమ్మినట్లు ఒప్పుకున్నాడు. శ్రీకాంత్ వద్ద నుండి మరో 2 కేజీలు 30 గ్రాముల గంజాయి, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, నలుగురిపైనా నార్కొటిక్స్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ దాడిలో ఎస్సై నరేష్, కానిస్టేబుళ్లు నాగరాజు, శంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story