- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIDEO: జగిత్యాలలో గంజాయి బ్యాచ్ హల్ చల్.. కాలేజీ విద్యార్థులపై దాడి
జగిత్యాలలో గంజాయి బ్యాచ్ హల్ చల్ చేసింది. వరంగల్ కు చెందిన ఓ విద్యాసంస్థ విద్యార్థులు టూర్‌కు వెళ్లి వస్తుండగా వారిపై దాడి చేసింది.

దిశ, వెబ్ డెస్క్: జగిత్యాలలో గంజాయి బ్యాచ్ హల్ చల్ చేసింది. వరంగల్ కు చెందిన ఓ విద్యాసంస్థ విద్యార్థులు టూర్‌కు వెళ్లగా జగిత్యాల జిల్లా ధర్మారం మండలంలోని పెట్రోల్ బంక్ వద్ద బస్సును ఆపారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ బ్యాచ్ బస్ డ్రైవర్, విద్యార్థులతో అకారణంగా గొడవకు దిగేందుకు ప్రయత్నించారు. వారిని పక్కకి నెడుతూ బూతులు తిట్టారు. అక్కడితో ఆగకుండా దాడి చేశాడు. ఈ క్రమంలో విద్యార్థులు అంతా వారిపై దాడి చేసి చితకబాది అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వారిని అరెస్ట్ చేశారు. అయితే అందకుముందు కూడా గంజాయి బ్యాచ్ ప్రెట్రోల్ వద్దకు వచ్చిన వాహనదారులతో దురుసుగా ప్రవర్తిస్తూ గొడవకు దిగింది. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. దీంతో గంజాయిపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు. video






