- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టురట్టు
గంజాయి సరఫరా చేస్తున్న ముఠా సభ్యులను పట్టుకున్న ఘటన పాలకుర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

దిశ,పాలకుర్తి : గంజాయి సరఫరా చేస్తున్న ముఠా సభ్యులను పట్టుకున్న ఘటన పాలకుర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.స్థానిక సీఐ జానకి రామ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఖుషీ గుట్ట సమీపంలో కొంత మంది యువకులు గంజాయి సరఫరా చేస్తున్నారని సమాచారం మేరకు పాలకుర్తి ఎస్ఐ పవన్ కుమార్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. స్టేషన్ ఘనపూర్ మండలం సముద్రాల గ్రామానికి చెందిన గుండె నవీన్,పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన గుగ్గిళ్ళ ప్రవీణ్,గుండమల్ల సంపత్,లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన చీటూరి శ్యాం,పాలకుర్తి చెందిన బండారి అఖిల్ ఓ గ్రూపుగా ఏర్పడి తక్కువ ధరకు గంజాయి తీసుకు వచ్చి గ్రామాల్లో యువతకు అలవాటు చేసి అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. వారి వద్ద నుంచి 1 కిలో 300 గ్రాముల ఎండు గంజాయి,బైక్,6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని,వారిని రిమాండుకు తరలించినట్లు తెలిపారు. ఎవరైనా గంజాయి అమ్మిన రవాణా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు .ఎస్ఐ పవన్ కుమార్,సిబ్బంది రాజ్ కుమార్,రమేష్,రవి,యాకయ్య,ప్రశాంత్ లను అభినందించారు.






