- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Gang Rape: తెలంగాణలో మరో సంచలనం.. బాలికపై గ్యాంగ్ రేప్

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. ముక్కుపచ్చలారని పసికందు నుంచి ముసలి వాళ్లను కూడా కామాంధులు వదలడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ (Telangana) రాష్ట్రంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా (Rangareddy District) నార్సింగి పోలీస్ స్టేషన్ (Narsingi Police Station) పరిధిలోని హైదర్‌షాకోట్ (Hydershah Kote)లో ఓ బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తామని సదరు యువతిని బెదిరించారు. ఎట్టకేలకు అసలు విషయం బయటకు రావడంతో బాలిక కుటుంబ సభ్యులు నార్సింగ్ పోలీస్ స్టేషన్ (Narsingi Police Station)లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు యువకులపై పోక్సో చట్టం (POCSO Act) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.