- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో రూ.3.5 కోట్ల నగదు సీజ్
by GSrikanth |
గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హోటల్ మారియట్ సమీపంలో నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్, గాంధీనగర్ పోలీసులు సంయుక్తంగా మంగళవారం తనిఖీలు నిర్వహించారు.

X
దిశ, ముషీరాబాద్: గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హోటల్ మారియట్ సమీపంలో నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్, గాంధీనగర్ పోలీసులు సంయుక్తంగా మంగళవారం తనిఖీలు నిర్వహించారు. రెండు షిఫ్టు డిజైర్ కార్లలో తనిఖీలు సోదాలు జరుపగా.. రూ.3.5 కోట్ల నగదు లభ్యమైంది. ఈ నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పొలీసులు ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి వద్దనున్న రెండు కార్లు, ఆరు సెల్‌ఫోన్లు, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని గాంధీ నగర్ పోలీసులు వెల్లడించారు.
Next Story






