రెండ్రోజులు చాలవు.. వారం రోజులు ఇవ్వండి: పెరోల్ కోసం గాదె ఇన్నయ్య పోరాటం

by Gantepaka Srikanth |

పెరోల్ కోసం తెలంగాణ ఉద్యమ నేత గాదె ఇన్నయ్య పోరాటం చేస్తున్నారు.

రెండ్రోజులు చాలవు.. వారం రోజులు ఇవ్వండి: పెరోల్ కోసం గాదె ఇన్నయ్య పోరాటం
X

దిశ, తెలంగాణ బ్యూరో: పెరోల్ కోసం తెలంగాణ ఉద్యమ నేత గాదె ఇన్నయ్య పోరాటం చేస్తున్నారు. ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన పెరోల్ గడువుపై మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. శనివారం గాదె ఇన్నయ్య తండ్రి సాల్మన్ రెడ్డి మరణించారు. తన తండ్రి సాల్మన్ రెడ్డి అంతక్రియలతో పాటు ఇతర కార్యక్రమాలు పూర్తిచేసుకోవడానికి పెరోల్ కావాలని గాదె ఇన్నయ్య కోర్టును కోరారు. అయితే.. ఎన్ఐఏ కోర్టు రెండు రోజులు మంజూరు చేసింది. దీంతో ఇన్నయ్య వారం రోజులు కావాలని విజ్ఞప్తి చేశారు. శనివార మళ్లీ పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల పాటు గడువు ఇవ్వడం ద్వారా దశదినకర్మలను ఇతర కార్యక్రమాలు అన్నింటినీ పూర్తి చేసే అవకాశం ఉంటుందని కోరారు. తన కుటుంబ సభ్యులకు ఈ సమాచారాన్ని తెలియజేస్తూ తండ్రి భౌతికకాయాన్ని ఫ్రీజ్‌లో భద్రపరచాల్సిందిగా సూచించారు. తమ పిటిషనర్ ఇన్నయ్య పోలీసులకు పూర్తిగా అందుబాటులో ఉంటూ రోజుకు రెండుసార్లు స్టేషన్కు వెళ్లి కండిషన్ బెయిల్ నిబంధనలను పాటిస్తారని, ఎటూ పారిపోయే అవకాశం కూడా లేదని.. మానవతా కోణంతో ఆలోచించి వారం రోజులపాటు పెరోల్ మంజూరు చేయాల్సిందిగా ఇన్నయ్య తరపున న్యాయవాది పిటిషన్ సమర్పించారు. కోర్టు నిర్ణయంపై ఉత్కంఠత నెలకొంది.

Next Story