విషాదం.. రైలు కిందపడి స్నేహితుల ఆత్మహత్య

by Naga Rani Yarlagadda |

ఇద్దరు స్నేహితులు రైలు కిందపడి తనువులు చాలించారు. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లాలో వెలుగుచూసింది.

విషాదం.. రైలు కిందపడి స్నేహితుల ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: రైలు కిందపడి ఇద్దరు స్నేహితులు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని తడ మండలం కొండూరు వద్ద ఈ ఘటన జరిగింది. సోమవారం ఉదయం పట్టాలపై మృతదేహాలు పడి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన ప్రాంతానికి చేరుకున్నారు. మృతులను పేర్నాడుకు చెందిన సునీల్, పిండిపాలెనికి చెందిన కల్యాణ్ లుగా గుర్తించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. యువకుల ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సమస్యలా లేక ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నారా? అన్న విషయాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Next Story