Fraud: డైరెక్టర్ శ్రీను వైట్లకు రూ.కోటి టోకరా.. వ్యవసాయ భూమి ఇప్పిస్తామని మోసం

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-26 05:53:35  IST  )

ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్లకు భూమి కొనుగోలులో భారీ షాక్ తగిలింది. వ్యవసాయ భూమి ఇప్పిస్తామని ఆయన నుంచి కేటుగాళ్లు రూ.కోటి వసూలు చేశారు.

Fraud: డైరెక్టర్ శ్రీను వైట్లకు రూ.కోటి టోకరా.. వ్యవసాయ భూమి ఇప్పిస్తామని మోసం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్ల (Srinu Vaitla) భూమి కొనుగోలు వ్యవహారంలో మోసపోయారు. వికారాబాద్ (Vikarabad) జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు వేరే వాళ్ల భూమిని తనదంటూ నమ్మబలికి ఆయనకు విక్రయించినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ఆయన సుమారు కోటి రూపాయల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా పరిధిలోని ఓ వ్యవసాయ భూమిని శ్రీను వైట్లకు విక్రయించేందుకు నిందితులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ భూమి తమదేనని నమ్మించి, ఆయన వద్ద నుంచి సుమారు రూ.1 కోటి వసూలు చేశారు.

అయితే, సదరు భూమిపై వివాదం నడుస్తుండగా, ఇటీవల కోర్టు ఆ భూమి వేరే వ్యక్తులకు చెందినదిగా తీర్పు వెలువడింది. దీంతో తాను కొన్న భూమి విక్రేతలది కాదని, తాను మోసపోయానని శ్రీను వైట్ల గుర్తించారు. ప్రస్తుతం ఆ భూమి విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.7 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో తాను మోసపోయానని గ్రహించి శ్రీను వైట్ల తనకు న్యాయం చేయాలని కోరుతూ హైదరాబాద్ సీసీఎస్ (CCS) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story