బర్త్‌డే పార్టీలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి

by Malleboina Mahesh |

పుట్టినరోజు వేడుకల్లో దుండగులు కాల్పులు జరపడంతో నలుగురు మృతి చెందగా.. మరో 28 మంది వరకు గాయపడ్డారు.

బర్త్‌డే పార్టీలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: పుట్టినరోజు వేడుకల్లో దుండగులు కాల్పులు జరపడంతో నలుగురు మృతి చెందగా.. మరో 28 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘోరమైన సంఘటన అమెరికాలోని అలబామా రాష్ట్రంలో చోటుచేసుకుంది. దుండగుల కాల్పుల్లో గాయపడిన వారిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆ ప్రాంత పోలీసు అధికారులు తెలిపారు. అలాగే కాల్పులు జరిపిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. కాల్పులకు పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టినట్లు తెలిపారు. అలాగే కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు పోలీసు అధికారి ఒకరు మీడియాతో తెలిపారు.

Next Story