- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విషాదం నింపిన విహారయాత్ర.. నదిలో పడి నలుగురు బాలికలు మృతి
తమిళనాడులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సరదాగా విహారయాత్రకు వెళ్లిన నలుగురు యువతులు కావేరి నదిలో పడి మృతి చెందారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సరదాగా విహారయాత్రకు వెళ్లిన నలుగురు యువతులు కావేరి నదిలో పడి మృతి చెందారు. కరూర్ జిల్లా మయనూర్‌లో బుధవారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి స్థానికుల సహయంతో బాలికల మృతదేహాలను బటయకు తీసుకువచ్చారు. విహారయాత్రక వెళ్లిన కూతుర్లు శవాలుగా బయటకు రావడంతో బాలికల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలికలు నదిలో పడిపోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read...
ప్రియుడు చేతిలో హత్యకు గురైన ఢిల్లీ యువతి: చివరి వీడియో ఇదే..!
Next Story






