గదిలో నలుగురు స్నేహితుల మృతి..

by Sujitha Rachapalli |

* గదిలో నలుగురు స్నేహితుల అనుమానాస్పద మృతి * కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు * స్థానికంగా నెలకొన్న విషాదం,,

గదిలో నలుగురు స్నేహితుల మృతి..
X

దిశ, వెబ్ డెస్క్: ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఆయిల్ సీడ్స్ కంపెనీలో పని చేస్తున్న నలుగురు ఎంప్లాయీస్.. ఒకే గదిలో అద్దెకు ఉంటున్నారు. అయితే చలి ఎక్కువగా ఉండటంతో రూమ్‌లో బొగ్గు పొయ్యి అంటించుకుని చలి కాచుకున్నారు. ఆ తర్వాత గది లాక్ చేసుకుని నిద్రపోయారు. అదే బొగ్గు నుంచి వెలువడే వాయువుల కారణంగా.. ఆక్సిజన్ తక్కువ కావడంతో.. ఊపిరి అందక చనిపోయినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని పాన్కి పోలీస్ స్టేషన్ ఏరియాలో ఈ ఘటన జరగ్గా.. స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది. నలుగురు మృతులు అమిత్ వర్మ, సంజయ్ సింగ్, రాహుల్ సింగ్, దావూద్ అన్సారీగా గుర్తించబడగా.. వీరంతా డియోరియా జిల్లా తౌకల్పూర్‌కు చెందిన వారు.

Next Story