- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు బందిపోట్లు మృతి
పోలీసులు ఎన్ కౌంటర్ లో నలుగురు బందిపోట్లు మృతి చెందారు. ఈ ఘటన అస్సాంలోని గోల్పారా జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: పోలీసులు ఎన్ కౌంటర్ (Encounter)లో నలుగురు బందిపోట్లు (Four dacoits) మృతి చెందారు. ఈ ఘటన అస్సాంలోని గోల్పారా జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈ రోజు ఉదయం ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకోగా.. కిడ్నాప్ (Kidnapping)కు ప్రయత్నించిన దుండగులను బందిపోట్లుగా గుర్తించారు. అయితే పోలీసుల రాకను గమనించిన బందిపోట్లు తప్పించుకునేందుకు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు వారిపై కాల్పులు (Police firing) జరపడంతో నలుగురు బందిపోట్లు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. అలాగే వారు ప్రయాణిస్తున్న వారి వాహనం నుంచి నాలుగు పిస్టల్స్, ఐదు మొబైల్ ఫోన్లు, కమ్యూనికేషన్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.






