పిజ్జా లవర్స్‌కు BIG అలర్ట్.. అత్యంత గలీజ్‌గా తయారీ

by Gantepaka Srikanth |

సాయంత్రం అయితే చాలు ఏదో ఒక స్నాక్స్ తినకుండా కొందరు ఉండలేరు.

పిజ్జా లవర్స్‌కు BIG అలర్ట్.. అత్యంత గలీజ్‌గా తయారీ
X

దిశ, వెబ్‌డెస్క్: సాయంత్రం అయితే చాలు ఏదో ఒక స్నాక్స్ తినకుండా కొందరు ఉండలేరు. ముఖ్యంగా ఆ సమయంలో వర్క్ చేసేవాళ్లంతా కచ్చితంగా ఏదో ఒకటి ఆర్డర్ చేసుకుని తింటుంటారు. ఎక్కువశాతం మంది పిజ్జా(Pizza)ను బెస్ట్ ఆప్షన్‌గా ఎంచుకోవడం మనం చూస్తుంటాం. అలాంటి వాళ్లందరికీ ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ వ్యాప్తంగా పిజ్జా హౌజ్‌(Pizza House)లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు(Food Safety Officials) ఆకస్మిక దాడులు చేశారు. మొత్తం 55 సెంటర్లలో తనిఖీలు చేశారు. పిజ్జాహట్, డోమినోస్, పిజ్జా ప్యారడైస్ సహా అన్నిచోట్లా దాడులు నిర్వహించారు. వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ వంటి ఉమ్మడి జిల్లాల్లో ఈ తనిఖీలు జరిపారు.

అయితే ఎక్కడా కూడా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని తనిఖీల్లో తేలింది. కాలం చెల్లిన సాస్‌లతో పాటు అసలు ఎక్స్‌పైరీ డేటే లేని సాస్‌లు వాడుతున్నట్లు గుర్తించారు. మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేని సిబ్బందితో ఈ పిజ్జాలు, బర్గర్‌లను తయారు చేయిస్తున్నట్లు నిర్ధారించారు. మొలకెత్తిన బంగాళదుంపలతో క్రిమికీటకాల మధ్యే తయారీ జరుగుతున్నట్లు తెలిపారు. తయారీ ప్రక్రియ అత్యంత గలీజ్‌గా ఉందని చెప్పారు. దీంతో అక్కడిక్కడే కొందరిపై కేసులు నమోదు చేశారు. మరికొంతమందికి షోకాజు నోటీసులు ఇచ్చారు.

Next Story