- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరదల్లో చిక్కుకున్న కుటుంబం.. పూర్తిగా మునిగిపోతుండటంతో కాపాడిన గ్రామస్తులు
మధ్యప్రదేశ్ శివపురి జిల్లా అమోలా పీఎస్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెనుక నుంచి ట్రక్కు ఢీకొనడంతో కుటుంబంతో సహా కారు వరదల్లో చిక్కుకుంది. ట్రక్కు ఢీకొనడంతో కదులుతున్న కారు నేరుగా సింధు నది పరివాహక ప్రాంతంలో

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ శివపురి జిల్లా అమోలా పీఎస్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెనుక నుంచి ట్రక్కు ఢీకొనడంతో కుటుంబంతో సహా కారు వరద నీటిలోకి వెళ్లిపోయింది. ట్రక్కు ఢీకొనడంతో కదులుతున్న కారు నేరుగా సింధు నది పరివాహక ప్రాంతంలో మునిగిపోయింది. కుటుంబం మొత్తం అందులోనే ఉండిపోయింది. దీంతో గ్రామస్తులు హీరోలుగా మారారు. ఫ్యామిలీని కాపాడి ప్రాణదానం చేశారు. కోటకు చెందిన శైలేంద్ర సింగ్ హండా.. భార్య రేఖా కన్వర్, పిల్లలు నోదిగ్, దేవదత్ కారులో ఒరాయ్ బాబా జై గురుదేవ్ సత్సంగానికి వెళ్తున్నారు. ఈ సమయంలో కారు అమోలా వంతెనను దాటి క్రషర్ దగ్గరకు చేరుకోగానే.. వెనుక నుండి వచ్చిన ట్రక్కు ఢీకొంది. ఫలితంగా కారు ఆనకట్టలో పడిపోయింది.
దీంతో గందరగోళం నెలకొనడంతో.. గోపాల్ పరిహార్, సుఖ్ దేవ్ లోది, రాకేశ్ మిస్త్రీ, మనోజ్ కలవత్ నీటిలోకి దిగి కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఆ లోపే ట్రక్కు డ్రవర్ పారిపోయాడు. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






