- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pakistan flash floods : ఆకస్మిక వరదలు..307 కి చేరిన మృతుల సంఖ్య
క్లౌడ్ బరస్ట్, ఆకస్మిక వరదల కారణంగా పాకిస్థాన్ లోని ప్రావిన్స్ బజౌర్, బునేర్, స్వాత్, మనేహ్రా, షాంగ్లా, టోర్ఘర్, బాటగ్రామ్ జిల్లాల్లో వినాశకరమైన వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా 300 మందికి పైగా మరణించారు.

దిశ, వెబ్‌డెస్క్: అతి భారీ వర్షాలు, క్లౌడ్ బరస్ట్ కారణంగా.. పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఆకస్మిక వరదలు (Flash floods) సంబవించిన విషయం తెలిసిందే. ఈ వరదల కారణంగా నిన్న రాత్రి వరకు 157 మంది మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. తాజాగా ఈ రోజు మధ్యాహ్నంకు ఈ సంఖ్య రెట్టింపు అయింది. వరదల ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. దీంతో పదుల సంఖ్యలో మృతదేహాలు బయటపడుతున్నాయి. నిన్న రాత్రి నుంచి ఈ రోజు మధ్యాహ్నం వరకు ఈ మొత్తం 307 మంది మృతి (307 people died) చెందినట్లు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా విపత్తు నిర్వహణ అథారిటీ (Disaster Management Authority) ప్రతినిధి ఫైజీ మీడియాతో మాట్లాడుతూ.. క్లౌడ్ బరస్ట్ (Cloud burst,), ఆకస్మిక వరదల కారణంగా ప్రావిన్స్‌లోని బజౌర్, బునేర్, స్వాత్, మనేహ్రా, షాంగ్లా, టోర్ఘర్, బాటగ్రామ్ జిల్లాల్లో వినాశకరమైన వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా 300 మందికి పైగా మరణించారని ఆయన మీడియాకు తెలిపారు. అలాగే ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికి ఒక్కసారిగా విరుచుకుపడ్డ వరదలు వందల మంది ప్రాణాలు తీసుకోగా.. పదుల సంఖ్యలో గాయాలపాలు చేశాయి.






