- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో ఘోర ప్రమాదం.. ఐదుగురు కార్మికులు దుర్మరణం
by Gantepaka Srikanth |
మరో ఘోర ప్రమాదం.. ఐదుగురు కార్మికులు దుర్మరణం

X
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక(Karnataka)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టెంపో వాహనం బోల్తా పడి ఐదుగురు కార్మికులు మృతిచెందగా.. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉడిపి జిల్లాలోని కోతల్కట్టే గ్రామం వద్ద జాతీయ రహదారి జరిగింది. వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో టెంపో వాహనం అదుపుతప్పి.. డివైడర్‌పైకి ఎక్కి బోల్తా పడిందని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యటు చేపట్టారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మృతులను అస్సాంకు చెందిన వారిగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






