ఘోర ప్రమాదాలు.. ఐదుగురు దుర్మరణం

by Naga Rani Yarlagadda |

తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా ఉలుందూర్ పేట సమీపంలో జరిగిన ప్రమాదంలో ఒక మహిళ సహా.. ముగ్గురు వ్యక్తులు మరణించారు.

ఘోర ప్రమాదాలు.. ఐదుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా ఉలుందూర్ పేట సమీపంలో జరిగిన ప్రమాదంలో ఒక మహిళ సహా.. ముగ్గురు వ్యక్తులు మరణించారు. వారు ప్రయాణిస్తున్న కారు.. ట్యాంకర్ లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టంకు తరలించారు.

మరోవైపు తుమకూరు - బెంగళూరు నేషనల్ హైవేపై శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించారు. నెలమంగళ తాలూకాలోని టి బేగూరు సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు శివలింగ గౌడ (60), ప్రమీల (55)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడ్డారు.

Next Story