ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

by Gantepaka Srikanth |

ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని రాయ్‌పూర్‌(Raipur)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది.

ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని రాయ్‌పూర్‌(Raipur)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. కారు, ట్రక్కు ఢీకొని కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం(Five People Spot Dead) చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను, చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. రన్నింగ్‌లో టైరు పగలడంతో ఎస్‌యూవీ కారు(SUV Car) అదుపుతప్పింది. ఈ క్రమంలోనే డివైడర్‌ను దాటి రాంగ్‌ రూట్‌లో వెళ్లి ఎదురుగా వస్తోన్న ట్రక్‌ను బలంగా ఢీకొట్టింది.

దీంతో కారులో ప్రయాణిస్తున్న వారంతా మృతిచెందినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతులంతా రాయ్‌పూర్ జిల్లా ఉల్లా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రోడ్డు ప్రమాదం జరుగడంతో రోడ్డుమీద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు సైతం స్పాట్‌కు వచ్చి ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story