సికింద్రాబాద్​-అగర్తలా ఎక్స్​ప్రెస్‌లో మంటలు

by Disha Web Desk 2 |
సికింద్రాబాద్​-అగర్తలా ఎక్స్​ప్రెస్‌లో మంటలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల జరుగుతున్న ఘోర రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఒడిశా ఘోర రైలు ప్రమాదం మరవకముందే.. మరో ఘటన వెలుగుచూసింది. మంగళవారం సికింద్రాబాద్​- అగర్తలా ఎక్స్​ప్రెస్‌లోని బీ5 కోచ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బ్రహ్మపుర స్టేషన్‌కు చేరుకోగానే ఈ ఘటన జరిగింది. రైలులో పొగ రావడం చూసిన ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు. వెంటనే అత్యవసర అలారంను మోగించారు. ఇక వెంటనే రైల్వే అధికారులకు కూడా సమాచారం అందించారు. మరికొంత మంది రైలు నుంచి దిగి అందులో ప్రయాణించేది లేదని తేల్చి చెప్పారు. తక్షణమే మరొక కోచ్‌ను ఏర్పాటు చేయవలసిందిగా డిమాండ్ చేశారు. కాగా ఎయిర్ కండిషనర్‌లో జరిగిన చిన్న షాట్ సర్య్కూట్ వల్ల కోచ్‌లో పొగ ఏర్పడి ఉండవచ్చని రైల్వే అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channel



Next Story

Most Viewed