స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

by Kema Shiva Kumar |

నగర పరిధిలో స్కూల్ బస్సులతో వరుస ప్రమాదాలు తల్లిదండ్రులను బెంబేలెత్తిస్తున్నాయి.

స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: నగర పరిధిలో స్కూల్ బస్సులతో వరుస ప్రమాదాలు తల్లిదండ్రులను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ చంపాపేట్ (Champapet) నుంచి శంషాబాద్ (Shamshabad) వైపు పిక్నిక్‌కు వెళ్తున్న కృష్ణవేణి స్కూల్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే, డ్రైవర్ అప్రమత్తతతో పాటు సమయస్ఫూర్తితో తీసుకున్న చర్యల ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ ఎదురుగా చోటుచేసుకుంది. పిక్నిక్‌కు వెళ్తున్న బస్సులో పిల్లలు ప్రయాణిస్తుండగా ఇంజిన్ ముందు భాగంగా ఉన్నట్టుండా మంటలు చెలరేగాయి. డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కకు తీసుకెళ్లి అందరు విద్యార్థులను సురక్షితంగా బస్సు నుంచి కిందరకు దించేశారు. మంటలు వేగంగా వ్యాపించే ముందే సిబ్బంది సమర్థవంతంగా స్పందించడంతో పిల్లలందరూ క్షేమంగా తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో కారణంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లే రూట్లో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు స్పాట్‌కు చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

Next Story