రామోజీ ఫిల్మ్ సిటీ ప్రధాన గేటు ముందు కారులో చెలరేగిన మంటలు

by Malleboina Mahesh |

న్యూయర్ వేడుకల వేళ ఉహించి ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి క్షణాల్లోనే కారు దగ్ధం అయింది.

రామోజీ ఫిల్మ్ సిటీ ప్రధాన గేటు ముందు కారులో చెలరేగిన మంటలు
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూయర్ వేడుకల వేళ ఉహించి ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి క్షణాల్లోనే కారు దగ్ధం అయింది. ఈ షాకింగ్ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలో ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీ ప్రధాన గేటు ముందు చోటు చేసుకుంది. ప్రయాణికులను కిందకు దించి, వాహనాన్ని పార్కింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఇంజిన్ నుండి మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే మంటలు ఉవ్వెత్తున ఎగసి పడటంతో కారు పూర్తిగా అగ్నికి ఆహుతై దగ్ధమైంది.

సమయస్ఫూర్తితో ప్రయాణికులు ముందే కారు దిగడంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. కారు నుంచి దట్టమైన పొగలు, మంటలు రావడంతో ఆ ప్రాంతంలో కాసేపు కలకలం రేగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Next Story