Fire Accident: రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.కోట్లలో ఆస్తి నష్టం

by Kema Shiva Kumar |

భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ఘటన మహారాష్ట్ర (Maharashtra)లో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది.

Fire Accident: రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.కోట్లలో ఆస్తి నష్టం
X

దిశ, వెబ్‌డెస్క్: భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ఘటన మహారాష్ట్ర (Maharashtra)లో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భీవండీ (Bhiwandi)లోని ఓ డెకరేషన్ గోడౌన్‌ (Decoration Godown)లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అసలే వేసవి కాలం కావడంతో ఆ మంటలు కాస్త భారీగా ఎగసిపడి పక్కనే ఉన్న మరో నాలుగు గోడౌన్లకు వ్యాపించారు. దీంతో ఆ గోడౌన్లలో ఉన్న మెటీరియల్ పూర్తిగా కాలి బూడిదైంది. ఈ దుర్ఘటనలో ప్రాణ నష్టంపై ఎలాంటి సమాచారం రాలేదు. అయితే, కాలిపోయిన మెటీరియల్ విలువ రూ.కోట్లలో ఉంటుందని యజమానులు పేర్కొన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మొత్తం ఐదు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story