- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూబ్లిహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. దుస్తుల షోరూంలో చెలరేగిన మంటలు
జూబ్లిహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రోడ్ నంబర్ 36లో మంగళగౌరి షోరూమ్‌లో మంటలు చెలరేగాయి.

దిశ, వెబ్ డెస్క్: జూబ్లిహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రోడ్ నంబర్ 36లో మంగళగౌరి షోరూమ్‌లో మంటలు చెలరేగాయి. అక్కడ భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో పాటు ప్రాంతమంతా భారీగా పొగలు వ్యాపించాయి. పక్క భవనాలకు కూడా మంటలు వ్యాపిస్తున్నాయి. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే అక్కడకు చేరుకుని మంటలు అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. షాప్ ముందు ఏర్పాటు చేసిన టెంపుల్ సెట్ షార్ట్ సర్య్కూట్ వల్ల అంటుకోవడం వల్లనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
ఉదయం షోరూ తెరుస్తున్న సమయంలో నిప్పురవ్వలు చెలరేగి టెంపుల్ సెట్ అంటుకున్నట్టు సమాచారం. టెంపుల్ సెట్ పూర్తిగా కాలిపోగా ఇప్పటికే షోరూంలోకి సైతం మంటలు వ్యాపించి దుస్తులన్నీ కాలిపోతున్నాయి. భవనం మొత్తం మంటలు, దట్టమైన పొగతో నిండిపోయింది. మంటలు భారీగా ఎగిసి పడుతుండటంతో రోడ్డుపై నుండి వెళ్లే వాహనాలను సైతం నిలిపివేశారు. ప్రస్తుతం షోరూం సిబ్బంది అంతా బయటే ఉన్నట్టు తెలుస్తోంది. షోరూం లోపల ఎవరూ లేరని పోలీసులు చెబుతున్నారు.






